Hosts » Gita Vani Profile
 
 
Program On Program Name Listen
Mar 19 2019 Gita vani
Mar 12 2019 Gita vani
Mar 05 2019 Gita vani

Host: Sriman Satya Gaura Chandra Dasa Prabhuji

 

Show: Gita Vani

 

About: శ్రీమాన్ సత్యగౌరచంద్రదాస ప్రభుజీ M.Tech (IIT-M), అధ్యక్షులు హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్;  ప్రాంతీయ అధ్యక్షులు అక్షయపాత్ర ఫాండేషన్  తెలంగాణ & ఆంధ్రప్రదేశ్.

 

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలకు సమాజ సేవతో పాటు ఆధ్యాత్మికతను పెంపోందించడానికి హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ సారధిగా శ్రీమన్ శ్రీ సత్యగౌర చంద్రదాసగా తన సేవలను అందిస్తున్నారు. అక్షయపాత్ర ఫౌండేషన్ ద్వారా ఆంధ్ర, తెలంగాణలో రోజుకు సుమారు 2.25 లక్షల మంది పిల్లలకు ఉచిత మధ్యాహ్న భోజనం అందించడమే కాకుండ భోజనామృతం, అన్నపూర్ణ 5 రూపాయాల భోజనం, సద్ధిమూట, అన్నక్యాంటిన్ ఇత్యాధి సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.                                                       

 

 శ్రీ సత్య గౌర చంద్రదాస బాల్యం నుంచి ప్రజ్ఞా వంతులు. చదువులో ఎప్పుడూ ఉత్తమ ప్రతిభను కనబర్చిన ప్రభుజీ 10వ తరగతిలో అత్యధిక మార్కులతో ఉత్తీర్ణత సాధించారు.  JNTU Kakinada లో B.Tech చదువులో స్వర్ణ పతకాన్ని సాధించడమే కాకుండా గేట్ పరీక్షలలో 99.97%తో మన రాష్ట్రంలోనే ఉత్తమంగా నిలిచి అప్పటి గవర్నర్ (కృష్ణకాంత్) చేతులు మీదుగా ఆ స్వర్ణ పతకాన్ని అందుకోవడం జరిగింది.

 

చదువులో చురుకైన ప్రతిభను కనబరిచిన శ్రీ సత్య గౌర చంద్రదాస ప్రభుజీ  M.Tech కి గాను IIT మద్రాసులో సీటు కైవసం చేసుకున్నారు. చదువు పూర్తి కాగనే బెంగుళురులో ఒక బహుళజాతి సంస్థలో సీనియర్ సాఫ్ట్ వేర్ ఇంజినీర్ గా కొలువు సంపాదించారు. బెంగుళురులో ఉన్న ఇస్కాన్ సంస్థ కార్యక్రమలు మరియు సంస్థాపకాచార్యులైన భక్తి వేధాంత స్వామీ శీలప్రభుపాద ప్రసంగాలకు, పుస్తకాలకు ప్రభావితలైయ్యారు. ఆ మహానగరంలో ఇస్కాన్ సంస్థ చేస్తునటువంటి  సేవ కార్యక్రమాల పట్ల ఆకర్షితులైయ్యారు.

                          

సుమారు 20 ఏళ్లుగా ఇస్కాన్ బెంగుళురు చేపట్టే పలు ఆధ్యాత్మిక సేవకార్యక్రమాలకు సారథ్యం వహిస్తు తనదైన ముద్ర వేశారు. అందులో భాగంగా భగవద్గీతలో ఉన్న సమస్త సారంశాన్ని నేటి ఆధునికి యుగంలో ఎదుర్కొంటున్న పలు సమస్యలను జయించడానికి యువతకు దిశానిర్ధేశం చేస్తున్నారు.  హరేకృష్ణ మూవ్మెంట్ హైదరాబాద్ లో వివిధ ఉన్నత విద్యాలయాల్లో యువత స్వశక్తికరణ సదస్సులు నిర్వహించారు. వారిందరికి మార్గనిర్ధేశుకునిగా కొనసాగుతూ వ్యక్తిత్వ వికాశ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విద్యార్థులకు చదువు, జీవితంలో ఎదురైయ్యే సంఘర్షణలు, నిరాశ నిసృహలను ధైర్యంగా ఎదుర్గొని ఆత్మవిశ్వాసం పెంపొందించే విధంగా స్వామీజి ఎంతోమంది యువతకు  మార్గనిర్ధేశం చేస్తున్నారు.